Thursday 31 December 2015

TSPSC Group 2 Notification on 31.12.2015

WISH YOU A HAPPY NEW YEAR - 2016 & HAPPY PONGAL
TSPSC Group 2 Notification on 31.12.2015, TSPSC Group2 notification, TSPSC Group II Notification, TSPSC December 31 notification,
కొలువుల కానుక
ఏప్రిల్లో గ్రూప్‌-2 నియామకాలు
439 పోస్టులకు టీఎస్పీఎస్సీ ప్రకటన
సగం ఎక్సైజ్సబ్ఇన్స్పెక్టర్పోస్టులే
మరో 357 ఉద్యోగాలకూ ప్రకటనలు
మొత్తంగా 796 కొలువుల భర్తీ
నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
ఈనాడు - హైదరాబాద్



నిరుద్యోగులకు నూతన సంవత్సర కానుక. ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలకమైనవిగా భావించే గ్రూప్‌-2 నియామకాలకు తెలంగాణ పబ్లిక్సర్వీస్కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) పచ్చజెండా వూపింది. 439 గ్రూప్‌-2 పోస్టులతో పాటు మరో 357 ఇతర పోస్టులకు కలిపి మొత్తం 796 ఉద్యోగాలకు గురువారం ప్రకటన విడుదల చేసింది. గురువారం (డిసెంబరు 31) నుంచి ఫిబ్రవరి 9 దాకా గ్రూప్‌-2 దరఖాస్తులు స్వీకరిస్తారు. 2016 ఏప్రిల్చివరి వారంలో (24, 25 తేదీల్లో) పరీక్ష నిర్వహించాలన్నది ప్రాథమిక ప్రణాళిక. సెప్టెంబరులోనే గ్రూప్‌-2కు సంబంధించిన పాఠ్యప్రణాళిక విడుదల చేశారు. మొత్తం 439 గ్రూప్‌-2 పోస్టుల్లో అత్యధికంగా 220 ఎక్సైజ్సబ్ఇన్స్పెక్టర్పోస్టులే ఉన్నాయి. యూనిఫాం సర్వీసులైన వీటికి గతంలో 28 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి ఉండేది. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన మూడేళ్ల సడలింపుతో ఈసారి గరిష్ఠ వయోపరిమితి 31 సంవత్సరాలుగా ఉండబోతోంది. మిగిలిన పోస్టులకు జనరల్కేటగిరీలో 18-44 ఏళ్లలోపు వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు మరో ఐదేళ్లు సడలించారు.పూర్తి వివరాలను గురువారం ఉదయం తర్వాత టీఎస్పీఎస్సీ వెబ్సైట్ www.tspsc.gov.in, eenadupratibha.net వెబ్సైట్లలో చూడవచ్చు.
సాంకేతిక కారణాలతో..: ప్రభుత్వం గ్రూప్‌-2 పోస్టుల నియామకాలకు ఎప్పుడో అనుమతి ఇచ్చినప్పటికీ సంఖ్య తక్కువగా ఉన్నందున టీఎస్పీఎస్సీ వేచి చూస్తూ వచ్చింది. మరిన్ని పోస్టులకు ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే వాటిని కూడా కలిపి ప్రకటన విడుదల చేయాలని భావించింది. అయితే ఏడాదిలో ప్రకటన విడుదల చేస్తే సంవత్సరం జులై 1నాటికి వయోపరిమితి గడువును నిర్దేశిస్తారు. గురువారం (డిసెంబరు 31)లోగా ప్రకటన విడుదల కాకుంటే 2016 జులై 1 కటాఫ్గా మారేది. తద్వారా వేలమంది నిరుద్యోగులు గరిష్ఠ వయోపరిమితిని దాటి అనర్హులయ్యే ప్రమాదం ఉంది. అలాంటివారి ప్రయోజనాల దృష్ట్యా తక్కువ పోస్టులకే అయినా టీఎస్పీఎస్సీ బుధవారం గ్రూప్‌-2 ప్రకటన విడుదల చేసిందని సమాచారం. దీంతో 2015 జులై 1నాటికి 18-44ఏళ్ల మధ్య వారు (జనరల్కేటగిరీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుల సమర్పణ ఆన్లైన్లోనే..: దరఖాస్తులను ఆన్లైన్ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసిన ఆన్లైన్పోర్టల్లో వన్టైమ్రిజిస్ట్రేషన్తో తొలుత తమ వివరాలను నమోదు చేసుకోవాలి. తర్వాత దరఖాస్తును కూడా దాని ద్వారానే సమర్పించాలి. 30 వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన ఉద్యోగానికైనా ఆన్లైన్ద్వారానే పరీక్ష నిర్వహిస్తారు. 30 వేలు దాటితే మాత్రం సాధారణ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. ఇప్పటిదాకా టీఎస్పీఎస్సీ నిర్వహించిన 9 రకాల ఉద్యోగ పరీక్షలన్నీ సాంకేతిక పోస్టులే. గ్రూప్‌ 2 ద్వారా సాధారణ విద్యార్హతల (డిగ్రీ) వారికి అవకాశం లభించడంతో పోస్టులు తక్కువగా ఉన్నా భారీస్థాయిలో దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వం మరికొన్ని గ్రూప్‌-2 ఉద్యోగాలకు అవకాశమిస్తే వాటినీ ప్రకటనలో చేర్చే అవకాశం ఉంది. గ్రూప్‌-2లో నాలుగు పేపర్లను ఉదయం, మధ్యాహ్నం ఒక్కొక్కటి చొప్పున రెండురోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రాథమికంగా ఏప్రిల్‌ 24, 25లను పరీక్ష తేదీలుగా నిర్ణయించారు. ఏవైనా అవాంతరాలు వస్తే తప్ప ఇవి మారకపోవచ్చు. గ్రూప్‌-2 పోస్టులన్నీ ఎగ్జిక్యూటివ్పోస్టులు కాబట్టి వాటికి మౌఖిక పరీక్ష ఉంటుంది.
రెండూ మహిళలకే..: గ్రూప్‌-2 మినహాయిస్తే మరో 357 పోస్టులకు టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించబోతోంది. వీటిలో అత్యధికంగా 311 వ్యవసాయ విస్తరణాధికారి పోస్టులున్నాయి. ఐటీఐ అర్హతతో కూడా 44 ఉద్యోగాలు ఉండడం విశేషం. వీటికి పరీక్ష తేదీని ఖరారు చేయాల్సి ఉంది. హైదరాబాద్జలమండలిలో ఉన్నతస్థాయి డిప్యూటీ జనరల్మేనేజర్పోస్టులు రెండింటిని కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పబ్లిక్సర్వీస్కమిషన్ఇలాంటి పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారని అంటున్నారు. రెండు పోస్టులూ రోస్టర్ప్రకారం మహిళలకే (జనరల్మహిళ, ఎస్సీ మహిళ) రిజర్వ్అయినట్లు సమాచారం. 357 పోస్టుల ప్రకటనతో ఎక్సైజ్కానిస్టేబుల్‌, ట్రాన్స్పోర్ట్కానిస్టేబుల్మినహా తమకు అనుమతిచ్చిన అన్ని ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ ప్రకటనలు విడుదల చేసినట్లైంది. ఆయా శాఖల నుంచి కొన్ని సాంకేతిక వివరణలు ఇంకా రానందున ఎక్సైజ్‌, ట్రాన్స్పోర్ట్కానిస్టేబుళ్ల ఉద్యోగాల ప్రకటన ఆగింది.
Click Here Official Website...

Group 2 Online Apply Here 
The New born State of Telangana Gift given to Un-Employees, Group 2 Notification Released on 31st December 2015, all Telangana un-employees peoples thank full to Telagana Government officials. Wish You Happy New Year - 2016 to Hon'ble CM Sri.K.Chandra Shekhar Rao Sir.


No comments:

Post a Comment